Header Banner

ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!

  Wed May 21, 2025 09:25        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ప్రతి కుటుంబానికీ ఆరోగ్య బీమాను అందించనుంది. న్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ (ఆరోగ్యశ్రీ) సేవలను బీమా పద్ధతిలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఒక ముసాయిదాను తయారు చేసింది.. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి కుటుంబానికి ఉచితంగా వైద్య సేవలు అందించాలని లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఏడాదికి రూ.2.5 లక్షల వరకు వైద్య సేవలను బీమా సంస్థ ద్వారా ఉచితంగా అందిస్తారు. ఆ పైన ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది. రాష్ట్రంలోని 26 జిల్లాలను రెండు భాగాలుగా చేసి, టెండర్ల ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేస్తారు.

రాష్ట్రంలో దాదాపు 1.43 కోట్ల పేద కుటుంబాలు ఉన్నాయి. అలాగే దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న 19-20 లక్షల కుటుంబాలకు కూడా ఈ బీమా పథకం వర్తిస్తుంది. వీరికి ఎలాంటి షరతులు ఉండవు. ఏడాదికి రూ.2.5 లక్షల విలువైన వైద్య సేవలు ఉచితంగా బీమ సంస్థ ద్వారా అందిస్తారు. ఒకవేళ అంతకుమించి ఖర్చు దాటితే.. రూ.25 లక్షల వరకు అయ్యే ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరిస్తుంది. దీనిని హైబ్రిడ్ విధానం అంటారు.. దీనికి తగిన విధంగా ముసాయిదా రూపొందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా అర్హులైన రోగులకు సంవత్సరానికి రూ.25 లక్షల విలువైన చికిత్స ఉచితంగా అందుతోంది.

నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) ఐటీ అప్లికేషన్‌ను ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ఉపయోగించనుంది. బీమా విధానంలో కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తారు. ట్రస్ట్ ప్రస్తుతం 2007లో తయారుచేసిన సాఫ్ట్‌వేర్‌ను వాడుతోంది. ఆసుపత్రిలో రోగి చేరినప్పటి నుంచి డిశ్ఛార్జి అయ్యేవరకు, రోగ నిర్ధారణ పరీక్షల రిపోర్టులు, ఆసుపత్రుల నుంచి క్లెయిమ్స్‌ వచ్చినప్పుడు వాటిల్లోని తప్పులను గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ట్రస్ట్ పరిధిలో జరిగే అవకతవకలను గుర్తించడానికి సామాజిక తనిఖీలు కూడా చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 30 రకాల స్పెషాలిటీలతో కలిపి ఏకంగా 3,257 రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వీటిని కొనసాగించడంతో పాటుగా.. బీమా విధానంలో 2,250 చికిత్సలు, ట్రస్ట్ ద్వారా మిగిలిన 770 చికిత్సలు అందుతాయి. ట్రస్ట్ అందించే 770 చికిత్సలు అంత ముఖ్యమైనవి కావు. అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ చికిత్సలను బీమా పరిధిలోకి తీసుకురాలేదు. 26 జిల్లాలను రెండు జోన్లుగా విభజించి.. ఏడాది కాల పరిమితితో టెండరు ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రెండేళ్ల వరకు బీమా కంపెనీలకు రెన్యువల్‌తో అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి టెండర్లను పిలవాలని నిర్ణయించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు ఇకపై నో టెన్షన్..! విమానాల తరహాలో బస్సుల్లో కూడా..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!

 

నేడు (21/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్‌న్యూస్..! వచ్చే నెల నుంచి ఆ రూల్ రద్దు?

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

ఎవ్వరూ మాట్లాడొద్దు..! లిక్కర్ స్కాంపై సీఎం ఆర్డర్స్!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APNews #GoodNews #FreeBenefit #2Point5LakhScheme #AndhraPradeshWelfare #PublicWelfare